* స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలమే నేడీ స్వేచ్ఛ
* గత ఐదేళ్లల్లో విధ్వంస, అరాచక పాలన సాగింది
* ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
* టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్
ప్రతి భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నారంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పల్లా శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను పల్లా శ్రీనివాస్ గుర్త చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పాలన అందిస్తూ.. వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపినిచ్చారు. నిర్వీర్యమైన పాలనను గాడిలో పెట్టి ముందుకు సాగడమే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్లకు నిజమైన నివాళులర్పించడమన్నారు. గత ఐదేళ్లుగా విధ్వంసం, అరాచక పాలన రాజ్యమేలిందని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కాలంలో రూ.45 లక్షల కోట్లు దోచుకుంటే గత వైకాపా ప్రభుత్వం అంతకంటే ఎక్కువ దోపిడీ చేసిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి, ఆలోచన విధానాలతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు వెళ్లుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.
అనంతరం టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు టీ.డీ జనార్ధన్, వర్ల రామయ్య, శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాద్ అహ్మద్, నేతలు దేవతోటి నాగరాజు, సప్తగిరి ప్రసాద్, పాతర్ల రమేష్, చప్పిడి రాజశేఖర్, కుప్పం రాజశేఖర్, బుచ్చి రాంప్రసాద్, ఏ.వీ రమణ, మన్నవ సుబ్బారావు, పరుచూరి కృష్ణ, హసన్ బాషా, హనుమంతరావు, దేవినేని శంకర్ నాయుడు, నర్సా నాయుడు, రాజేంద్రప్రసాద్, ఎస్పీ సాహెబ్, భాస్కరరావు మరియు మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.