టీడీపీలోకి 80 కుటుంబాలు

వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం హనుమాపురం, రేమిడిచర్ల, మేళ్లవాగు, పమిడిపాడు, జయంతిరామాపురం గ్రామాల నుంచి అధికార వైసీపీని వీడి బుధవారం టీడీపీలోకి 80 కుటుంబాలు చేరాయి. వారిక జీవీ ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.