– గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిక్షాలు తొక్కుతూ జాబ్ క్యాలెండరు ఖాళీ పోస్టుల భర్తీ కోరుతూ నిరుద్యోగులతో తెలుగుయువత వినూత్న నిరసన పోలీసుల అడ్డగింత ఉద్రిక్తత.
వైకాపా ప్రభుత్వం అమలుకు నోచుకోని నోటిఫికేషన్లు అంటూ ఎన్నికల మోసపూరిత గారెడీలు ఆపి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగుల వయోపరిమితి కోల్పోకుండా ఆదుకోవాలి లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం అని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తూ అమలుకాని నోటిఫికేషన్లతో మరోసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రిక్షాలు తొక్కుకుంటూ తెలుగుయువత నిరుద్యోగులు తరలి వచ్చారు.
పోలీసుకు రిక్షాల ప్రదర్శనను అడ్డుకొని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా నిలిపివేసినప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటే జాబు క్యాలెండరు ఇవ్వాలని ఖాళీ పోస్టులు భర్తీ చేసి రోస్టర్ విధానాన్ని పాటించాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కేవలం రాగ ద్వేషాలకు రాజకీయ కక్షలకు ప్రాధాన్యమిస్తూ యువత నిరీద్యోగులకి భవిష్యత్ మీద భరోసా కల్పించటంలో పూర్తిగా విఫలమయ్యి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సిలు ఇస్తామని ఇప్పటికి మూడు జనవరిలు పోయినా గతంలో వదిలిన జాబులు లేని ఫేక్ జాబ్ క్యాలెండర్ లో అరకకూరగా ఇచ్చ్చిన నోటిఫికేషన్ల భర్తీ ఇప్పటికి జరగకపోగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరలా ఏపీపీఎస్సి ద్వారా నోటిఫికేషన్లంటూ ప్రకటన చేపించి మరో గారెడికి తేర లేపారని అన్నారు.
నేడు రాష్ట్రంలో నిరుద్యోగులు మీరు నాలుగేళ్లుగా ఖాళీ పోస్టులో భర్తీ చేస్తారని ఎదురు చూసి చూసి వయోపరిమితి కోల్పొతున్నారని ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు నిరుద్యోగులకు వయసు రీత్యా అనర్హులవుతున్నారు. ఈ నేపథ్యంలో 34 ఏళ్ల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం గడువు ఈఏడాది సెప్టెంబర్ 30 వ తేదితో ముగిసింది. ఈ వెసులుబాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ దాక పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది
కానీ క్యాలెండర్లో ప్రకటించిన ప్రకారం నోటిఫికేషన్ లేనందున వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కావున వెంటనే రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 66,309 ఖాళీ పోస్టులను అమలు కానీ నోటిఫికేషన్లతో కాకుండా యుద్ధ ప్రాతిపదికన భర్తీ చెయ్యాలని లేకుంటే నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు, ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,కొల్లిమర్ల రాము, కొండెపు శేఖర్ బాబు, అధికార ప్రతినిధులు సింగు గోపి,షేక్ షుకూర్, కార్యనిర్వాహక కార్యదర్సులు షేక్ రషీద్,బొక్కా లక్ష్మణ్,మన్నెం శ్రీనివాస్ రావు, కార్యదర్సులు వేమా విజయ్ కాంత్, పఠాన్ అథాఉల్లా ఖాన్ ,గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుయువత అద్యక్షులు షేక్ అఫ్రోజ్, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుయువత అద్యక్షులు నాగిశెట్టి నాగరాజు, గుంటూరు పశ్చిమ తెలుగుయువత ప్రధాన కార్యదర్సులు షేక్ ఇమ్రాన్,పూసల శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు ,గుంటూరు తూర్పు ప్రధాన కార్యదర్శి దాసరి మస్తాన్ రావణ్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు, ప్రత్తిపాడు నియాజకవర్గ ఉపాధ్యక్షులు నల్లూరి వంశి,గుంటూరు రురల్ మండల అధ్యక్షులు యదాల గణేష్ యాదవ్, వట్టిచెరుకూరు మండల తెలుగుయువత తెలుగుయువత అద్యక్షులు మన్నవ గోపి, ఆటో యూనియన్ నాయకులు మచ్చు దేవా ,గోనుగుంట్ల సుధీర్, 47వ డివిజన్ టిడిపి అధ్యక్షులకు దాది గోపాల్,టిడిపి నాయకులు కొల్లి నాగుల్ ,షేక్ సుభాని,టిడిపి ఎస్సి నాయకులు ఇత్తడి పున్నారావు ,దివ్యంగ విభాగం రాష్ట్ర నాయకులు నంబూరి శ్రీనివాస్ రావు ,శివ , తెలుగుయువత నాయకుల చిక్కాల శివరామ కృష్ణ, చింతా వినోద్ ,బుల్లా కుమార్ బాబు ,సన్నపు ఆదిత్య రెడ్డి , సుద్దపల్లి రవి,కళ్యాణ్ , కళ్యాణ్, నవీన్ ,శశి ,సాంబశివరావు, యువత నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గున్నారు.