కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టడం
– బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్
మూకుమ్మడిగా బీసీ సీట్లని అడ్డగోలుగా అమ్ముకున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. బీసి నాయకులని ఒర్వలేని రేవంత్ రెడ్డి, బీసీ ప్రజలని వుద్దరిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే.చెట్ల మీద విస్తర్లు కుట్టినట్లు అడ్డమైన మాటలు రాసి బీసీ డిక్ల రేషన్ అని ప్రజలని వంచించే కుట్ర చేస్తుండు రేవంత్ రెడ్డి.గత తొమ్మిదేళ్ళుగా బీసిలకు, బహుజన బిడ్డలకు పెద్దపీట వేస్తూ వారిని అద్భుతంగా అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీది.
జాగ్రుతమైన బీసీ సమాజం రేవంత్ రెడ్డి కుట్రలకు వ్యతిరేకంగా కొట్లాడుతుంది. కర్రు కాల్చి వాతపెడుతుంది. ”పొన్నాల లక్ష్మయ్య తో పాటు కాంగ్రెస్ లోని అనేక మంది బీసి నాయకులని బలితీసుకున్న కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా వుంది” అని మండిపడ్డారు. ఈ మేరకు బిఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..
రేవంత్ రెడ్డి మూకుమ్మడిగా బీసీ సీట్లని అడ్డగోలుగా అమ్ముకున్న దుర్మార్గుడు. పార్టీలో ఏళ్ళ తర్వాత పడి చేస్తున్న బీసి నాయకులని ఒర్వలేని రేవంత్ రెడ్డి, బీసీ ప్రజలని వుద్దరిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే తప్పా మరొకటి కాదు. తెలంగాణ వ్యాప్తంగా వున్న బహుజన బిడ్డలు రేవంత్ రెడ్డి దుర్మార్గాలపై లోతుగా అలోచించాలి” అని విజ్ఞప్తి చేశారు.
‘చెట్ల మీద విస్తర్లు కుట్టినట్లు అడ్డమైన మాటలు రాసి బీసీ డిక్ల రేషన్ అని ప్రజలని వంచించే కుట్ర చేస్తుండు రేవంత్ రెడ్డి. వాస్తవానికి కేసీఆర్ నేతృత్వంలో గత తొమ్మిదేళ్ళుగా బీసిలకు, బహుజన బిడ్డలకు పెద్దపీట వేస్తూ వారిని అద్భుతంగా అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. దాదాపు యాభై వేలకోట్ల రూపాయిలు ఈ తొమ్మిదేళ్ళలో బీసిలు, బహుజన బిడ్డల కోసం ఖర్చు చేశారు.
కుల వృత్తుల పునరుద్ధరణ, ఆత్మగౌరవ భవనాలు, ఇలా రకరకాల రీతుల్లో బీసీలని అందుకున్న పార్టీ బిఆర్ఎస్. మహేష్ గౌడ్, అనిల్, వి హనుమంత్ ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో పల్లకి మోసే బోయలు మాదిరిగా పని చేస్తున్నారు. బీసీ నాయకులని చులకన భావంతో వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి నెట్టివేసి వాళ్ళ టికెట్లని కోట్ల రూపాయిలకు అమ్ముకున్న రేవంత్ రెడ్డి.. బీసీ డిక్లరేషన్ చేసి ఉద్దరిస్తానని చెప్పడం దుర్మార్గం. రేవంత్ రెడ్డి మాయల బారిన బీసీ బిడ్డలు పడకూడదు” అని కోరారు.
”ముగ్గురు పీసీసీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో బీసిలు లోతుగా అలోచించాలి. కాంగ్రెస్ లోని బీసి నాయకులు ఎందుకు ఆత్మన్యూనతాభావంలో వున్నారో అలోచించుకోవాలి. పార్టీలో వున్న బీసీ నాయకులని ఆదుకోలేని, గౌరవం ఇవ్వలేని రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు ? జాగ్రుతమైన బీసీ సమాజం రేవంత్ రెడ్డి కుట్రలకు వ్యతిరేకంగా కొట్లాడుతుంది, కర్రు కాల్చి వాతపెడుతుంది’ అని పేర్కొన్నారు దాసోజు.