లీడర్కు 25 లక్షణాలుండాలి. అవి ఉంటేనే అతని ప్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. లక్షలాదిమంది అతని వెనుక నడుస్తారు. కోట్లాదిమంది అతని కోసం ఎదురుచూస్తారు. నాయకుడంటే పేరు, కీర్తి మాత్రమే కాదు. ఒక త్యాగం.. ఒక ధైర్యం.. ఒక వీరోచితపోరాటం. అన్నింటికీ మించి.. నేనున్నాననే భరోసా.. అతడే లీడర్! ప్రజలకు కావలసిన నాయకుడు కూడా అతడే! అవును.. అతనే ఒక సైన్యం!! ఆ 25 లక్షణాలేమిటో చూద్దాం!!!
లీడర్ కి ఉండాల్సిన 25 లక్షణాలు
1. లీడర్- గతాన్ని వదిలేయాలి.
2. లీడర్- నిత్య విద్యార్థి గా ఉండాలి.
3. లీడర్- మనసులో ఉన్న విషయం బయటకు సానుకూలంగా చెప్పాలి.
4. లీడర్- ఈగో వదిలేయాలి.
5. లీడర్- బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. లీడర్- తప్పును కూడ శాoతoగా చెప్పాలి.
7. లీడర్- ఎవరైనా బాదలో ఉంటే ఓదార్పు నివ్వాలి.
8. లీడర్- బాధలో ఉన్నవారికి భరోసా నివ్వాలి.
9. లీడర్- ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించాలి.
10. లీడర్- ఎంత కఠిన నిర్ణయం ఆయన తీసుకునే ధైర్యం ఉండాలి.
11. లీడర్ – మార్గ దర్శకుడు గా ఉండాలి.
12. లీడర్- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. లీడర్- సమస్యలపై రాజీ పడకూడదు.
14. లీడర్- ప్రతి పనిలో ఒక అడుగు ముందు ఉండాలి.
15. లీడర్- ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి.
16. లీడర్- తను ఉన్న చోట నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. లీడర్- సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండాలి. 18. లీడర్- ప్రతి ఒక్కరి ఎదుగుదలను కోరుకునే వాడైఉండాలి. అడ్డుకోకూడదు.
19. లీడర్- తన స్వార్థం కోసం కాకుండా అందరికోసం ఆలోచించాలి.
20. లీడర్ కు ఆహంకారం ఉండకూడదు.
21. లీడర్ వివాద రహితుడుగా ఉండాలి.
22. లీడర్ బెదిరింపులకు దిగకూడదు.
23. లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి.
24. లీడర్ ఎప్పుడు నేర్చుకునే తత్వం అలవర్చు కోవాలి. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి.
25. లీడర్ మానవత్వం కలిగివుండాలి.
– వెలగపూడి గోపాలకృష్ణ