సీఎం సారూ… నిన్ను మర్చిపోము సామీ!

చరిత్రలో గొప్ప సీఎం నువ్వేనయ్యా..!!

ఒక్క డిఏ ని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన సీఎం నువ్వే నయ్యా…

డి ఏ ఎరియర్స్ ఎప్పటికి (ఇప్పటికి) ఇవ్వని సీఎం నువ్వే నయ్యా…

7 డిఏ లు ఆపిన సీఎం నువ్వేనయ్యా..

ఉద్యమం చేస్తే గానీ పిఆర్‌సి ఇవ్వని సీఎం నువ్వేనయ్యా..

ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా…

తగ్గిన ఫిట్‌మెంట్ ను ఎరియర్స్ నుండి తీసుకునే సీఎం నువ్వేనయ్యా..

ఉద్యోగులను గొప్పగా పిఆర్‌సి పేరుతో మోసం చేసిన సీఎం నువ్వేనయ్యా…

డాబాలో అద్దెకు ఉన్న ఉద్యోగులను పూరిపాకల్లోకి మార్చిన ఘనత నీదేనయ్యా

పీఎఫ్ డబ్బు తినేసిన సీఎం నువ్వేనయ్యా..

ఏపీజీఎల్‌ఐ డబ్బు తినేసిన సీఎం నువ్వేనయ్యా..

రిటైర్ అయిన ఉద్యోగికి డబ్బు ఇవ్వలేక ఏజ్ పెంచిన సీఎం నువ్వేనయ్యా..

పిఆర్‌సి తో జీతం పెరుగుతుందనే అపోహను తుడిచేసిన సీఎం నువ్వేనయ్యా…

ఉద్యోగులు నిన్ను ఎందుకు దూరంగా ఉంచకూడదో అర్థం చేసుకున్నారు.

నువ్వేంటో చూపించావ్…

మరి మేము చూపించాల్సిన సమయం కోసం ఎదురుచూస్తూ..

– అల్లూరి

( ఒక రాష్ట్ర పెన్షనర్)