గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ
ఏపీ సిఐడి జగన్ పైన క్రిమినల్ కేసు పెట్టి విచారించాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పి ఎ శ్రీనివాస్ రావును కలిసి కంప్లైంట్ లో కోరారు.
ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని,మెగా డి ఎస్సిలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ,ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని,జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ,ఏపీ కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి 5ఏళ్ళు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ నిరుద్యోగ యువతకు చేసిన మోసం!చేసారని, గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.