పిండ ప్రదానాలకు సైతం నీళ్లు అందుబాటులో లేని దుస్థితి

– జగన్ పాలనలో సంక్షేమం కాదు సంక్షోభం
– గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారు
– టిడిపి జనసేన ప్రభుత్వంలో దెందులూరు గ్రామగ్రామానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక – బి.సింగవరంలో తమ్మిలేరు పై బ్రిడ్జి నిర్మిస్తాం
– 365 రోజులు నీరు అందుబాటులో ఉంచుతాం”
– దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ – భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పెదవేగి,జనవరి11: అవినీతి, అక్రమాలతో నిండి పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని, తిరిగి మామా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి అంటే టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.

దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.తమ గ్రామానికి విసిబిసిన చింతమనేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పూలమాలలు, మహిళల మంగళ హారతులతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామ కూడలిలోని NTR విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు మేలు చేసేలా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన 6 పధకాల విశిష్టతను వివరించారు.

ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన 6పధకాల అమలు వల్ల ప్రతి పేద కుటుంబానికి నిజమైన లబ్ది చేకూరుతుందని, ప్రజలకు సంక్షేమ పధకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ఆధ్వర్యంలోని టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు బి.సింగవరం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా అండగా నిలిచి రోడ్లు నిర్మించాను అని, దుగ్గిరాల బైపాస్ నుంచి సింగవరం గ్రామం వరకు రహదారి నిర్మాణానికి రూ.7కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి,టెండర్లు పిలిస్తే, ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైసిపి నాయకులు సింగవరం గ్రామ అభివృద్ధి ని గాలికి వదిలేశారు అని అన్నారు.

కనీసం పిండ ప్రదానాలకు సైతం నీళ్లు అందుబాటులో లేని దుస్థితి సింగవరంలో ఉందని, మరో 2నెలల్లో జరగనున్న ఎన్నికల్లో టిడిపి జనసేన విజయం తధ్యం అని, ఈ సారి ఎమ్మెల్యే గా గెలిచి సింగరంలో తమ్మిలేరు పై బ్రిడ్జి నిర్మాణం చేపడతానని, 365 రోజులు గ్రామస్థుల మౌలిక అవసరాలకు నీరు అందుబాటులో ఉండేలా చేస్తామని చింతమనేని భరోసా ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షుడు బొప్పన సుధా, సమన్వయ కమిటీ సభ్యులు తాతా సత్యనారాయణ, మాజీ ఎంపిపి బక్కయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు పి.నరేష్, రామసింగవరం సర్పంచ్ అడపా శ్రీనివాస్, పార్టీ నాయకులు పి.వీరస్వామి, కోదండ రామయ్య, క్లస్టర్ ఇన్ఛార్ వెంకట నారాయణ,సిహెచ్ దుర్గాప్రసాద్, ఎం.సురేష్, పరసా పరమ,జనసేన నాయకులు అబ్బులు, మధుసూధన్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు