ఎస్పీ కి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు
వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారం పై ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్ర పై తప్పుడు ప్రచారం
ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
గుంటూరు జిల్లా : ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ..ఎక్కడో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని ఫేక్ మెసేజ్ పెట్టారు. నర్సారావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి పీఏ, సిరిది అప్పలరాజు పీఆర్వో వెంకటరమణ ఈ తప్పుడు పోస్ట్ చేశారు. నేను అనని మాటలను నా పోటో పెట్టి అక్రమంగా పోస్ట్ చేశారు. పొన్నూరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐర్ నమోదు చెయ్యలేదు.
అమలాపురం మాదిరి కృష్ణా, గుంటూరు ప్రాంతాలలో కులాల మద్య విద్వేలను రెచ్చగొట్టేదుకే పోస్టు చేశారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న భయంతో విద్వేషాలు సమాజంలో అశాంతికి తెరతీశారు. కంప్లైంట్ ఇచ్చిన స్పందించని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. నిజమైన అంబేడ్కర్ వాదులు ఈలాంటి చర్యలకు పాల్పడరు. ఫేక్ మెసేజ్ పెట్టిన వారిపై ఎందుకని చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.