ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు

– కాలం నిర్ణయిస్తే, ప్రజల కోసం పోరాడుతా’

– హీరో విశాల్

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్టార్ హీరో విశాల్ స్పందించారు. ‘నాకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా. విద్యార్థులకు చదివిస్తున్నా. రైతులకు సాయం చేశా. లాభాలను ఆశించి ఏ పనిచేయను. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే, ప్రజల కోసం పోరాడుతా’ అని వెల్లడించారు.