-మన హద్దురాళ్లపై జగన్ ఫోటో ఎందుకు?
– టిడిపి ఇప్పటివరకు ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు
శ్రీకాకుళం శంఖారావంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి
యువగళం జైత్రయాత్రలో రాష్ట్రప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన యువనేత లోకేష్ శంఖారావంలో భాగంగా ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది.నిస్సత్తువ ఆవరించిన జాతి పునరుజ్జీవం కోసం యువనేత లోకేష్ శంఖారావం ప్రారంభించారు.
వైసిపి నేతలు ఎన్ని అవమానాల పాల్జేసినా ప్రజలకోసం పోరాడుతున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు.అన్న ఎన్టీఆర్ సారధ్యంలో 4సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు మంత్రిగా నా భర్త పనిచేశారు.
యువనేత లోకేష్ మంత్రిగా ఉన్నపుడు శ్రీకాకుళానికి తాగునీటి ప్రాజెక్టు మంజూరు చేశారు. మన హయాంలో కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, 80శాతం పూర్తిచేశాం, ప్రస్తుత పాలకులు మిగిలిన 20శాతం పూర్తిచేయలేక పోయారు.
గత ప్రభుత్వంలో 5వేల టిడ్కో ఇళ్లు మంజూరు చేయగా, 1238 టిడ్కో ఇళ్లు పూర్తిచేశాం, వైసిపి వచ్చాక వాటిని పాడుబెట్టారు.రాష్ట్ర ప్రజల కష్టాలు వింటూ 3132 కి.మీ.ల పాదయాత్ర పూర్తిచేసిన లోకేష్ రేపటి తరానికి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు జైలులో ఉన్నపుడు చలించిపోయిన పవన్ కళ్యాణ్ సైకోప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయించుకుని బేషరతుగా పొత్తు ప్రకటించారు.
రాష్ట్రంలో పేదప్రజలకు స్వాంతన కలిగించేందుకు చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, బిసిలను అన్నివిధాలా ఆదుకున్న ప్రభుత్వం టిడిపినే, రాష్ట్రానికి దశదిశ చంద్రబాబునాయుడే.అభివృద్ధి కాముకుడు చంద్రబాబును కాదనుకొని ఒక సైకోను ఎన్నుకుని ఇబ్బందులు పడుతున్నాం. మళ్లీ ఆయనకు ఓటువేస్తే మన పొలాలు, ఆస్తులు కొట్టేస్తారు, మన హద్దురాళ్లపై ఆయన ఫోటో ఎందుకు?
రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబునాయుడుకే ఉంది, రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రజలంతా గెలిపించుకోవాలి.