– రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు
•వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం
•ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కుట్ర
•ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తుంది. పోలీస్ అధికారులతో వైసిపి ప్రభుత్వం తన మార్కు రాజకీయానికి తెర లేపింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు సభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు సైతం చేశారు.
దీంతోపాటు అధినేత రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బి అధికారులకు దరఖాస్తు చేశారు. లక్షలాది మందితో సభ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకొల్లు లోని పావులూరు రోడ్డులో గల ఓ రైతు దేవాదాయ శాఖ భూములను లీజుకు తీసుకోవడంతో ఆ స్థలంలో సభ నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులకు రైతుల సమ్మతితో దరఖాస్తు చేశారు. బుధవారం తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలతో బహిరంగ సభకు తారక రామ విజయభేరి ప్రాంగణంగా నామకరణం చేసి భూమి పూజ కార్యక్రమాన్ని సైతం కనులు పండుగ నిర్వహించారు.
భూమిని చదును చేసి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రాత్రి సమయంలో దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేశారు. రైతు ఇష్ట ప్రకారం లిఖితపూర్వకంగా బహిరంగ సభ నిర్వహణకు అన్ని శాఖలకు దరఖాస్తు చేసి వారి అనుమతితోనే పనులు పూర్తి చేశారు. లక్షలాది మందితో సభ నిర్వహిస్తున్నారని సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారు. దీనిలో భాగంగా బహిరంగ సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతో పోలీసులతో వైసిపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంది.
అయితే దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు కాపీని అడిగినప్పటికీ స్పందించకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సభ నిలిపివేసేందుకు ప్రభుత్వ శాఖలతో అడ్డంకులు సృష్టించడాన్ని ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.