జగన్…దమ్ముంటే నాకు టికెట్ రాకుండా ఆపు

-చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని సొంతం చేసుకోనున్న కూటమి
-ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయిన మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్…
-ఆఖరి నుంచి మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డికి ఖాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

హైదరాబాద్: చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని కూటమి సొంతం చేసుకోనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు . పొత్తు, సీట్ల ఖరారు పై చర్చించేందుకు రేపో, ఎల్లుండో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి రానున్నారని ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేసినట్లు సాక్షి దినపత్రికలో ప్రచురించారు. పొత్తుతోపాటు, సీట్లు, అభ్యర్థుల ఖరారు పై నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించినట్లుగా సాక్షి దినపత్రిక వార్తా కథనంలోను, సామాజిక మాధ్యమాలలో పేర్కొనడాన్ని చూశామని తెలిపారు .

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లు భేటీ అయి పొత్తులపై చర్చించి ఒక కొలిక్కి తీసుకురానున్నారు. అదే రోజు నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తెలిసిపోతుందన్నారు. నరసాపురం స్థానం నుంచి నేను మళ్లీ పోటీ చేయడం ఖాయమన్న ఆయన, నా సీటు నేనే డిసైడ్ చేసుకున్నానని చెప్పారు .

పొత్తు లో భాగంగా నరసాపురం స్థానాన్ని ఏ పార్టీ కోరుకుంటే, ఆ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని రెండేళ్ల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. అయితే కొన్ని కూలీ నీలి చానల్స్, కొన్ని వెబ్సైట్లో పిల్ల సజ్జల తమకు తోచింది రాసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు రేపో, మాపో సమయం అడిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నా సీటును ఆపేందుకు ప్రయత్నించుకోవాలని సవాల్ చేశారు. ఈ ప్రయత్నంలో విజయం నాదో, నీదో తేలిపోతుందన్నారు.

తెదేపా, జనసేన, బిజెపిల మధ్య పొత్తు ఖరారు అవుతుందని, ఈ దెబ్బకు వైకాపా తుడిచిపెట్టుకుపోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దేశంలో ప్రజాదారణ పొందిన ముఖ్యమంత్రిల జాబితా లో ఆఖరి స్థానం నుంచి లెక్కిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటారనేది నా భావన అని రఘురామ కృష్ణంరాజు అన్నారు . ఇంతకంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఉన్నారేమో నాకైతే తెలియదు. ఇంతటి విధ్వంసాన్ని చేయడం అనేది ఇతర ఏ ముఖ్యమంత్రిలకు సాధ్యం కాదని, అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమంటూ విమర్శించారు.

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల తొలి పది స్థానాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చోటు లభించలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇండియా టుడే నిర్వహించిన మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ సర్వేలో వివిధ రాష్ట్రాలలో స్థానిక ముఖ్యమంత్రిల పట్ల వ్యక్తమైన ప్రజాభిప్రాయం ఆధారంగా తొలి పది స్థానాలలో నిలిచిన ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7%తో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3% ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు.

దానికి రివర్స్ గా రాష్ట్రంలో అవినీతిమయమైన పరిపాలన అందించిన పాలకులకు ప్రజలు తగిన రీతిలో జవాబు చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 నుంచి 15 మంది జాబితాలోనైన ఉంటారా?, లేకపోతే 15 నుంచి 20 మంది ముఖ్యమంత్రి జాబితాలోనైనా ఉన్నారా? అన్నది ప్రశ్నార్థకమేనని చెప్పారు. ఇండియా టుడే సంస్థ కేవలం టాప్ టెన్ ముఖ్యమంత్రిల జాబితాను మాత్రమే విడుదల చేశారు. ఆ తరువాత వారి జాబితాను విడుదల చేయడం భావ్యం కాదని భావించి ఉంటారు. మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. ఇండియా టుడే సర్వేకు ప్రామాణికత ఏమిటి అని ఎవరైనా అంటే ప్రజలు ఒప్పుకోరు.

జగన్మోహన్ రెడ్డి తనకు తాను ముఖ్యమంత్రిగా 100కు 99 మార్కులు వేసుకున్నప్పటికీ, ఇండియా టుడే సర్వేలో మాత్రం పాస్ మార్కులను సాధించలేకపోయారు. ఇండియా టుడే ను కూడా ఇన్ డైరెక్ట్ గా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు చేశారు. తిరుపతిలో కాంక్లేవ్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. టైమ్స్ నౌ మాదిరిగా కాకుండా ఇండియా టుడే సంస్థ యజమాన్యం ముక్కుసూటిగా వ్యవహరించేలా ఉంది .

ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లను ఇస్తున్నందుకు టైమ్స్ నౌ యజమాన్యం తమ సర్వేలలో వైకాపాకు 25 స్థానాలకు గాను 25 స్థానాలు, లేదంటే 24 స్థానాలు ఇచ్చి అధికార పార్టీ నేతల మెప్పు పొందే ప్రయత్నాన్ని చేసింది. ఇటీవల విడుదల చేసిన సర్వేలలో మాత్రం ఎందుకో 25 పార్లమెంట్ స్థానాలకు గాను 19 స్థానాలకు పరిమితం అయినట్లుగా సర్వే అంచనాలను ప్రకటించి, ఆశ్చర్యపరచారన్నారు . అయినా అది కూడా అబద్ధపు సర్వే అంచనా నేనని పేర్కొన్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రోజున ఉప లోకాయుక్తగా రజినీ రెడ్డి అనే న్యాయవాదిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సామాజిక న్యాయం లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలలో రెండింటిని తన సొంత సామాజిక వర్గ నేతలైన వై.వి సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి లకు కేటాయించి పెద్దపీట వేశారని అపహస్యం చేశారు.

ఉపలోకాయుక్తగా న్యాయమూర్తులను నియమించాలనే నిబంధనలను పక్కనపెట్టి, 25 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగిన వ్యక్తులను కూడా నియమించవచ్చునన్న నిబంధనను ఆసరాగా చేసుకుని రజినీ రెడ్డిని నియమించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నియమించుకుంటూ వెళ్తున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.