జగన్ ఓ మెంటలోడు

-పాలిచ్చే ఆవు టీడీపీ… దున్నపోతు వైసీపీ
-నర్సీపట్నం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

నర్సీపట్నం : ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకు ప్యాలెస్ పిల్లికి ఉచ్చ పడటం ఖాయం. పోరాటాల, పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ఒక్కటే తీసుకువచ్చారు.

బాబు గారి హయాంలో పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు తీసుకువస్తే ఈ ప్రభుత్వంలో రోజుకో కుంభకోణం, రోజుకో మానభంగం, రోజుకో కిడ్నాప్ జరుగుతోంది.నర్సీపట్నం ప్రజలు ఆలోచించాలి.. విశాఖపట్నం ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయ్యారంటే ఇక మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి.

అంతేకాదు.. రోజుకో భూకబ్జా. వైకాపా భూకబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడిన విశాఖ ఎమ్మార్వో రమణయ్యను అతికిరాతకంగా కొట్టి చంపారు. ఈ జగన్ ఓ మెంటలోడు.. మనం కట్టిన భవనాలు, పాఠశాలలకు రంగులేసి ఏదో ఈయన పొడిచినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మన పిల్లలకు విద్య దూరం చేశారు.

అన్ని పాఠశాలలు కలిపి మన దగ్గరకు తీసుకువస్తాడంటా. 117 జీవో తీసుకువచ్చి ఉపాధ్యాయులకు పోస్టులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ డ్రాపౌట్స్ లో దక్షిణ భారతదేశంలోనే మన రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది. భారతదేశంలో 12.6 శాతం ఉంటే ఏపీలో 16.3 శాతం ఉంది.

గతేడాదిలో లక్షా 73వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయారు. ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలలు కట్టారు, ప్రహరీగోడలు నిర్మించారు. మరుగుదొడ్లు కట్టారు. ఏకంగా డిజిటల్ క్లాస్ రూమ్ లు కూడా తీసుకువచ్చారు. మేం వస్తే 117 జీవో రద్దు చేసి.. విద్యను ప్రతి గడపకు తీసుకెళ్తాం.

రెండు నెలల్లో జగన్ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోంది. నాది అంబేద్కర్ రాజ్యాంగం. నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల మధ్యలో ఉంటా.. నువ్వు పరదాల చాటున ఉంటావు.అయ్యన్నపాత్రుడు, నేను కలిసి 25వేల కి.మీ సీసీ రోడ్లు వేస్తే.. నువ్వు కనీసం గుంత కూడా పూడ్చలేని దద్దమ్మ. ప్రజలు పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హా

నర్సీపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడో పులి ఉంది. ఆయన పేరు అయ్యన్నపాత్రుడు. 2019 నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అందుకే ఆయనపై 17 కేసులు పెట్టారు. రేప్ కేసు కూడా పెట్టారు. ఆయన్ను చూస్తే ఈ ప్రభుత్వానికి ఆయనంటే ఎంత భయమో. 2019లో పాలిచ్చే ఆవును కాదని తన్న దున్నపోతును తెచ్చుకున్నాం. పాలిచ్చే ఆవు టీడీపీ. దున్నపోతు వైసీపీ. 2019లో గణేశుడిని గెలిపించారు. దేవుడిలా బాగా పరిపాలిస్తాడంటే.. గణేశుడికే చెడ్డపేరు తీసుకువచ్చారు.

టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. పెండింగ్ లో ఉన్న 2300 టిడ్కో ఇళ్లు వంద రోజుల్లో పూర్తిచేసి గృహప్రవేశాలు చేపిస్తాం. మినీ ఐటీడీఏ ఏర్పాటుచేస్తాం. గిరిజన భవన్ లు ఏర్పాటుచేస్తాం. నాతవరం వద్ద జూనియర్ కళాశాల ఏర్పాటుచేస్తాం. తాండవ రిజర్వాయర్ మరమ్మతు పనులు పూర్తిచేసి నీరు అందిస్తాం. రోడ్లు దారుణంగా ఉన్నాయి. గుంతల్లో రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. 35 కి.మీల ప్రయాణం రెండు గంటలు పట్టింది. మేం వచ్చిన రెండు ఏళ్లలోనే అన్ని రోడ్లు వేస్తాం.