బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ మృతి

– కుటుంబసభ్యులను ఓదార్చిన పురందేశ్వరి
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంతాపం
– నివాళి అర్పించిన కేంద్రమాజీ మంత్రి సుజనా, పాతూరి, అధికార ప్రతినిధులు

విజయవాడ: ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న పాలూరి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా చిత్తశుద్ధి-అంకితభావం గల పార్టీ కార్యకర్తను కోల్పోవడం విచారంగా ఉందని, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. కాగా నిబద్ధత గల కార్యకర్త శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నివాళి అర్పించారు. పార్టీ – పార్టీలో పనిచేసే వారిపై సంపూర్ణ అవగాహన ఉన్న శ్రీనివాస్ మృతి చెందడం పార్టీకి తీరని నష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధులు జయప్రకాష్, లంకాదినకర్, విల్సన్ తదితరులు శ్రీనివాస్ మృతిపై సంతాపం ప్రకటించారు.