టాలీవుడ్ ట్రెండింగ్ టాప్ స్టార్స్ ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతూ ఉండటం విశేషం.
ప్రభాస్ కల్కి 2898ఏడీకి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటంతో దానికి తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ చేసి నైట్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక గేమ్ చేంజర్ లో యాక్షన్ ఘట్టాలని ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ తో రామ్ చరణ్ కి సంబందించిన మేగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది. దీని తరువాత ఒకటి, రెండు షెడ్యూల్స్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫారెస్ట్ సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ కూడా షూట్ చేశారు. ఇప్పుడు కీలక సన్నివేశాలని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ ఒకే చోట షూటింగ్ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావాల్సినవే కావడం విశేషం. కల్కి మూవీ మేలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పుష్ప 2 ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గేమ్ చేంజర్ రిలీజ్ పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత శంకర్ ఈ మూవీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.