– భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి
తెలుగుదేశంపార్టీ కార్యకర్త కూతురికి ఉచిత విద్య అందింస్తానని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.యలమంచిలి నియోజకవర్గం, మునగపాక మండలం, కాకర్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వాస అప్పారావు కుటుంబాన్ని భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు.
అప్పారావు కూతురు సునీత చదువుపట్ల చాలా ఆసక్తిగా ఉందని, ఆర్థిక సమస్యల వల్ల చదువులో ముందుకు వెళ్లలేకపోతోందని కుటుంబ సభ్యులు భువనేశ్వరికి వివరించారు.వెంటనే భువనేశ్వరి స్పందించి కార్యకర్త కూతురు సునీతకు ఎన్టీఆర్ ట్రస్టు నుండి ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి అప్పారావు కూతురు సునీతకు ఉచిత విద్య, వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భువనేశ్వరి తెలిపారు. తనుకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పిన భువనేశ్వరికి సునీత, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.