– అరాచక పాలనకు మహానాడు ఈ పేపర్ నాంది కావాలి
– మహానాడు క్షణక్షణాభివృద్ధి చెందాలి
– నిజాలతో నిలదీయాలి
– నియంత పాలనలో నిలదీసే మహానాడు ఈ పేపర్ అవసరం
– మహానాడు ఈ పేపర్ ఆవిష్కరణలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
జర్నలిజం విలువలు మహానాడుతో మళ్లీ మొదలు కావాలి
– నిజాలు నిర్భయంగా వెలికి తీయాలి
– బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్
మహానాడు దుష్ట శిక్షణ చేయాలి
-జనం గుండె చప్పుడు వినిపించాలి
– డిజిపి ఏబి వెంకటేశ్వరరావు
– ఆత్మీయ సమ్మేళనంలో అంగరంగ వైభవంగా మహానాడు ఈ పేపర్ ఆవిష్కరణ
– మహానాడు ఈ పేపర్ ఆవిష్కరించిన ఎంపీ రఘురాం కృష్ణంరాజు
– ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్
-హాజరైన ప్రముఖులు
మహానాడు కు శుభాశీస్సులు
హైదరాబాద్: ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగం లో ఈ పేపర్ ప్రారంభించడం చాలా అవసరమని, తద్వారా ప్రజలకు వాస్తవాలు వేగంగా చేరవేసే అవకాశం ఉంటుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. మహానాడు లాంటి గుండె ధైర్యం గల ఈ పేపర్ రావటం పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించే సామాన్యులకు శుభవార్త అన్నారు.
గురువారం సాయంత్రం మహానాడు ఈ పేపర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఎంపీ రఘురామకృష్ణం రాజు మహానాడు ఈ పేపర్ ను ఆవిష్కరించగా, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మహానాడు ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు.బోడేపూడి వెంకట సుబ్బారావు యాజమాన్యంలో సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రమణ్యం సంపాదకత్వంలో మహానాడు ఈ పేపర్ ప్రారంభోత్సవo ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిధి గా హాజరుకాగా బీజేపి అధికార ప్రతినిధి సత్య కుమార్ విశిష్ట అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రఘూరామకృష్ణoరాజు మాట్లాడుతూ ఏపీ లో ఒక అరాచక పాలన అంతమొందిoచాలంటే మహానాడు లాంటి మీడియా అవసరమని,అందుకే మహానాడు క్షణక్షణాభివృద్ది చెందాలని కోరుకుంటూన్నానన్నారు.
అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ విలువలు అంతరించిపోతున్న కాలం లో మహానాడు ఈపేపర్ ఒకనాటి జర్నలిస్ట్ ల ఉన్నత విలువలను పునః ప్రతిష్టిoచాలని కోరుకుంటున్నానన్నారు. సంచలనాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా వుండాలని ఆకాoక్షి స్తున్నానన్నారు. పడిపోతున్న జర్నలిజం విలువలను మహానాడు తో పున : ప్రతిష్ట అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఉన్నది ఉన్నట్టు విన్నది విన్నట్టు ప్రజలకు చేరవేసే ప్రధాన ఆయుధంగా మహానాడు ఆరిభవించాలని సత్యకుమార్ ఆకాంక్షించారు.
డీజీపీ ఏ బి వెంకటేశ్వరావు మాట్లాడుతూ ..
చరిత్రను తిరగ రాసే ఈ సమయంలో , ఈ పేపర్ పెట్టడం చాలా సందర్భోచితం అన్నారు. రాబోయే రోజుల్లో మహానాడు మీడియా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలని కోరుకుంటున్నానన్నారు. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో నిజాన్ని నిర్భయంగా రాయటం సాహసోపేతమని వ్యాఖ్యానించారు. మహానాడు బాధితుల పక్షాన నిలబడి, వారి గళం వినిపించాలని సూచించారు.
సభ కు కు సీనియర్ పాత్రికేయులు ప్రైమ్ నైన్ ఎడిటర్ భోగాది వెంకటరాయుడు సభాద్యక్షత వహించగా ప్రత్యేక ఆహ్వానితులుగా మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెద్ద పేరిరెడ్డి, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య, డిజిపి ఏబి వెంకటేశ్వరరావు, ప్రముఖ జర్నలిస్టు పూల విక్రం, బిజెపి అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణం,బిజెపి నేత లంకా దినకర్,ప్రముఖ న్యాయవాది పి రవితేజ, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.