ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ కు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.