జక్కన తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కెరీర్లు ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ నాటు నాటు స్టెప్పులతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఏకంగా వెస్టర్న్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకోవడం.. ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైన్ అవార్డులు కూడా వచ్చాయి. అంతేకాక పలు అంతర్జాతీయ వేదికల మీద ట్రిపుల్ ఆర్ హీరోల పేర్లు మారుమోగి పోయాయి. దీంతో ఇద్దరికీ గ్లోబల్ స్టార్ డమ్ వచ్చింది. అయితే క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో చరణ్ సక్సెస్ అయ్యాడు కానీ, తారక్ మాత్రం ఇంకా వెనుకబడిపోయాడనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం రామ్ చరణ్ అమెరికా నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు, అక్కడి నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు ఎంత హంగామా జరిగిందో మనం చూశాం. కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో దీని గురించే చర్చలు జరిగాయి. అదే ఎన్టీఆర్ స్వదేశానికి వచ్చినప్పుడు నెట్టింట ఈ రేంజ్ లో హడావిడి జరగలేదు. ఫ్యాన్స్ కొంత వరకు సెలబ్రేషన్స్ చేశారు కానీ, దానికి పెద్దగా రీచ్ రాలేదు. ఇక ‘నాటు నాటు’ పాటకు అకాడమీ అవార్డు వచ్చి ఏడాది కావొస్తున్నా, ఇప్పటికీ రామ్ చరణ్ ఏదొక సందర్భంలో తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కానీ తారక్ మాత్రం ట్రిపుల్ ఆర్ పాట ద్వారా పబ్లిసిటీ చేసుకునే అవకాశాలను కోల్పోతున్నారనే కామెంట్లు కూడ మరోపక్క వినిపిస్తున్నాయి. అటు ఫ్యామిలీ పరంగా ఎలాగూ ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. అన్నయ్య కళ్యాణ్‌రామ్ తప్పించి తనను బాబాయ్‌లు ఇంకా మిగతా కుటుటంబ సభ్యులు ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోరు. సరే వచ్చిన పేరు కూడా తనకు తాను మంచి పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్.. ఖాన్ త్రయంతో కలిసి ‘నాటు నాటు’ పాటకు కాలు కదిపారు. అలానే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సూర్యలతో కలిసి ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేసారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గత వారం రోజులుగా చెర్రీ గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇలా అంబానీ పెళ్లి వేడుకల్లోనే కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా ‘నాటు నాటు’ ద్వారా వచ్చిన పాపులారిటీని చరణ్ క్యాష్ చేసుకుంటున్నారు. కానీ రామరాజుతో పాటుగా అధ్బుతమైన డ్యాన్స్ చేసి ఆ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంలో ఈక్వల్ సహకారం అందించిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం మిగతా హీరోల మాదిరిగా తారక్ సోషల్ మీడియాలలో అంతగా యాక్టివ్ గా ఉండకపోవడం.. ఆయన గురించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకునే వ్యక్తులు లేకపోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా సినిమా అప్డేట్లు ఇవ్వడంతో పాటుగా అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. వాళ్ళు కాకపోయినా వారి సతీమణులు అయినా ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటారు. ఇలాంటి వాటిల్లో మహేశ్ కు నమ్రత శిరోద్కర్, చెర్రీకి ఉపాసన, బన్నీకి స్నేహా రెడ్డి సపోర్ట్ గా ఉంటుంటారు. కానీ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మీ ప్రణతి దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. లక్ష్మీ ప్రణతి చాలా ప్రైవేట్ పర్సన్. తారక్ మాదిరిగానే ఆమె కూడా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా షేర్ చేసుకోరు. ఆమె ఒక హోస్ వైఫ్ గా ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ, భర్త యోగ క్షేమాల విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటుందే తప్ప.. సినిమా అప్డేట్లు, పబ్లిసిటీ విషయాల గురించి పెద్దగా ఆలోచించరని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మరీ ఎవ్వరూ పట్టించుకోకపోతే తారక వెనకబడిపోతారుగా. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే రాజకీయపరంగా కూడా తారక చాలా దూరంగా ఉంటాడు. ఎక్కడా తారక్‌ను ఎదగనివ్వరు. భార్యా భర్తలు ఇద్దరూ ప్రైవేట్ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు కాబట్టే, ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడరని అంటున్నారు. అంతేకాదు రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రానా దగ్గుపాటి లాంటి హీరోలు ప్రచారం కోసం కొన్ని బాలీవుడ్ ఏజెన్సీలతో టై అప్ అయినట్లుగా కథనాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ ఎలాంటి ఏజెన్సీతో ఒప్పందం చేసుకోలేదేమో, అందుకే పబ్లిసిటీ విషయంలో మిగతా హీరోల కంటే కాస్త వెనక ఉన్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ‘దేవర’ మూవీలో నటిస్తున్న తారక్.. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో మరికొన్ని సినిమాలు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. సో రానున్న రోజుల్లో పాన్ ఇండియా వైడ్ ‘యంగ్ టైగర్’ గురించి గట్టిగా సౌండ్ వినిపిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి తారక్ కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే బావుంటుందని ఆయన అభిమానులు అందరూ కూడా భావిస్తున్నారు. ఇక పోతే రాజకీయాల్లో వెనకబడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు స్కిల్ డెపలెప్మెంట్ నిధుల పక్కదారి కేసులో జైలుకి వెళ్ళి విషయం తెలిసిందే మరి అలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. బాబును కనీసం పలకరించలేదన్న వాదనలు కూడా మరో పక్క వినపిస్తున్నాయి. ఇకపోతే గతంలో ఓసారి టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.