టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత సూర్య కిరణ్ హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. మొదటి సినిమా ‘సత్యం’తోనే తెలుగు చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత ధన 51, రాజూభాయ్, చాప్టర్ 6, నీలిమై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. సూర్యకిరణ్ నటి కల్యాణిని పెళ్లాడారు. కానీ, కొన్నాళ్లకు ఈ దంపతులు విడిపోయారు. ఈయన నటి సుజితకు సోదరుడు.