అదే మా ప్రభుత్వ విధానం
ఇది పేదలు మర్చిపోలేని రోజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దీవెన సభ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు. మహబూబ్ బాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మహబూబాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
10 సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్ఎస్ పాలనలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేక లేక చేపట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ట్ర ప్రజలకు భారం కానుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతం కలుషితం కానున్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను ప్రకటించిన ప్రతి గ్యారెంటీని అమలు చేసి తీరుతుంది
పేద ప్రజలు ఈరోజును సువర్ణ అక్షరాలతో రాసుకుని గుర్తుంచుకోవాల్సిన రోజు. బిఆర్ఎస్ పాలనలో ఇంటి కోసం తిరిగి తిరిగి ప్రజలు అలసిపోయారు. అలిసిపోయిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చింది. బిఆర్ఎస్ పాలనలో దోపిడీకి గురవుతున్న సంపదను దోపిడి కాకుండా ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలకు పంచుతామని చెప్పాం అధికారంలోకి రాగానే పంచుతున్నాం
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనం, భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొంది కాంగ్రెస్ వాగ్దానం నెరవేర్చే క్రమంలో అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారంగా నేడు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలందరి పక్షాన అభినందనలు తెలుపుతున్నాను. ప్రజల సంపదను ప్రజలకే పంచుతాము అదే మా ప్రజాపాలన లక్ష్యం.