కాకాణి చేసిన దుర్మార్గపు పనులకి శిక్ష అనుభవించకతప్పదు
భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు
నేను పెట్టిన ఏ ఒక్క కేసులోనూ శిక్ష నుంచి తప్పించుకోలేడు
మళ్లీ పాత ఇనుము కోసం చిల్లర దొంగలు కోర్టు ఆవరణలోకి రాకూడదని, కుక్కలు అరవకూడదని కోరుకుంటున్నా
నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కాకాణి సృష్టించిన నకిలీ డా క్యుమెంట్లపై తాను దాఖలు చేసిన సివిల్ పరువు నష్టం దావాకు సంబంధించి కోర్టుకు వచ్చిన సోమిరెడ్డి
కాకాణి గోవర్ధన్ రెడ్డి 2016 డిసెంబర్ 23న నాతో పాటు నా కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియా ముందు పెట్టారు. నన్ను మానసికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా దెబ్బతీయాలనే కుట్రతోనే నకిలీ డాక్యుమెంట్లు, పాసుపోర్టులు, వీసాలు సృష్టించాడు.
తెలుగు ప్రజలందరి ముందు నా కుటుంబ పరువు, ప్రతిష్టలను దెబ్బతీయాలని ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ కుట్రపై అప్పట్లోనే నేను క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు సివిల్ పరువు నష్టం దావాలో విచారణ మొదలైంది. ఈ రోజు డాక్యుమెంట్ల మార్కింగ్ చేశారు.
మళ్లీ 15వ తేదీన మరికొన్ని డాక్యుమెంట్ల మార్కింగ్ జరగనుంది. 21వ తేదీన విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసులోనూ విచారణ ప్రారంభం కానుంది. క్రిమినల్ కేసుకు సంబంధించిన హియరింగ్ కూడా త్వరలోనే మొదలవనుంది.మలేషియాలోని పలు బ్యాంకుల్లో నాకు, నాకుటుంబసభ్యులకు ఖాతాలు ఉన్నట్లు, నిలాయ్ సిటీలో 68 ఎకరాల భూమి ఉన్నట్లు, కౌలాలంపూర్ లో ప్లాటు ఉన్నట్లు, నిలాయ్ సిటీలోనే రెండు భవనాలు ఉన్నట్లు, మలేషియాకు చెందిన ఇద్దరితో మాకు నగదు లావాదేవీలు జరిగినట్లు, బ్యాంకాక్ లో పవర్ ప్రాజెక్టు ఉన్నట్లు, హాంకాంగ్, సింగపూర్ లోనూ ఆస్తులున్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు, స్టాంపులు, బ్యాంకు స్టేట్మెంట్లు తయారు చేయించాడు
దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, నా అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా అనుమానించే పరిస్థితి కాకాణి తెచ్చాడు. నీచమైన, హీనమైన ఆలోచనలతో ఇలాంటి దుర్మార్గాన్ని చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. 2014 ఎన్నికల సందర్భంగా విషపూరితమైన నకిలీ మద్యాన్ని పంచి ఏడుగురి ప్రాణాలు బలితీసుకున్నాడు
నకిలీ మద్యం, నకిలీ పత్రాలే కాదు వావిలేటిపాడులో రూ.25 కోట్లు విలువ చేసే దళితుల భూములను కజ్జా చేశాడు.కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణను చంపేసిన పోలీసులను ఈ రోజుకీ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఉదయగిరి నారాయణ పోస్టుమార్టం రిపోర్టును మార్చివేయించడమే గాక సాక్ష్యాలు లభించకుండా ఆయన మృతదేహాన్ని కుల సంప్రదాయాలకు విరుద్ధంగా పోలీసు బందోబస్తు మధ్య దహనం చేయించాడు.
వెంకటాచలం మండలంలో ఇద్దరు ముస్లింలను చంపిన ఎస్సైను వెనుకేసుకొస్తున్నాడు. అడవుల్లో క్రూరమృగాలు కూడా ఇలాంటి ఘోరాలను చేసివుండవు. ఈ పాపాలన్నింటికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫలితం అనుభవించడం ఖాయం. నేను దాఖలు చేసిన కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. క్రిమినల్ కేసులో లాగే మళ్లీ పాత ఇనుముకు దొంగలు రావడం, కుక్కలు అరిచే పరిస్థితులు వస్తాయేమోనని భయం వేస్తోంది.
ఇకపై ఆయన పాత ఇనుము కోసం కోర్టు ఆవరణలోకి దొంగలు రాకూడదని, కుక్కలు అరిచి వారితో ఫైళ్ల దొంగతనం చేయించే పరిస్థితులు తీసుకురాకూడదని కోరుకుంటున్నా. కాకాణి చేసిన దుర్మార్గపు పనులకి శిక్ష అనుభవించకతప్పదు. భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు. నేను పెట్టిన ఏ ఒక్క కేసులోనూ ఆయన తప్పించుకోలేడు