కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు… ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…. ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే… టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు
వెయిట్ చేశారు, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ నాకు అవకాశం ఇచ్చారు, ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది, భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అననికి మంచి భవిషత్తు ఉండాలి. నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్.ఆర్.ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు, ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు, వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది, సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.