హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు.