– ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం
ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్ లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి.జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.