-స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో ఓడిపోతాడు
-హత్యకు బలైన వారిచే పెద్దిరెడ్డే వికలాంగుడౌతారు
-వైకాపాకు సత్తా ఉంటే పొత్తులపై ఎందుకు విషం కక్కుతున్నారు?
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ పెద్దిరెడ్డి రామకృష్ణా రెడ్డి అహంకార పూరితంగా నోరుపారేసుకున్నాడు. పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడు. ఈ హత్యలకు బలైన కుటుంబాల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్దిరెడ్డి వికలాంగుడౌతాడేమోనని అతని అంతరాత్మ చెబుతున్నట్టున్నది. అందుకే పెద్దిరెడ్డి తన స్థితిని చంద్రబాబుకు అంటగట్టి నోరుపారేసుకుంటున్నాడు.
రౌడీలు, మాఫియాలు, కళంకిత పోలీసుల పొత్తు లేకుండా పెద్దిరెడ్డి పుంగనూరులో గెలవలేడనేది కొండంత సత్యం. అందుకే 700 మందిపై అక్రమ కేసులు పెట్టించాడు. ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసం చేయించాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడి నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నాడు.
పొత్తులు పెట్టుకొన్నందుకు చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటున్న పెద్దిరెడ్డికి దమ్ముంటే నరేంద్రమోదీ పొత్తులపై ఆ మాట అనగలడా? టీడీపీ పొత్తలు బహిరంగం. జగన్ రెడ్డివి చీకటి పొత్తులు కాదా? మాఫియాలతో, కళంకితులతో జగన్ పొత్తులు ప్రజలకు తెలుసు. రావణ వధ కోసం శ్రీరాముడే వానరులతో పొత్తు పెట్టుకున్నాడు. దోపిడీ, నేరాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజా కాంక్ష మేరకే టీడీపీ పొత్తులు. వైకాపాకు సత్తా ఉంటే పొత్తులపై ఎందుకు విషం కక్కుతున్నారు?