ప్రజాసంక్షేమం టీడీపీతోనే సాధ్యం

పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

పాణ్యం : రాష్ట్రానికి చంద్రబాబు లాగా ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలని, జగన్‌ లాగా దోచుకునే నాయకుడు వద్దని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గ, గడివేముల మండల కేంద్రంలో గౌరు చరిత రెడ్డి పర్యటించారు. బీసీ కాలనీలో సూపర్‌ సిక్స్‌ బాబు డోర్‌ టు డోర్‌ శంఖారావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగారు. ఈ కార్యక్రమంలో గడిగరేవుల గ్రామనికీ చెందిన వైసీపీ నాయకులు నగరి శంకర్‌, పార్వతమ్మ, తెలుగు లక్ష్మమ్మ సుజాతతో పాటు 20 కుటుంబాలు గ్రామ అధ్యక్షుడు కంది శీను ఆధ్వర్యంలో చరితమ్మ సమక్షం లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, మండల నాయకులు మాజీ ఎంపీపీ మంచాల కట్ట శ్రీనివాస్‌ రెడ్డి, బుజునూరు పంట రామచంద్రారెడ్డి, సీతారామి రెడ్డి, మైనారిటీ నాయకులు బిలకల గూడూరు రఫీ, ఫరూక్‌, బొల్లారం మాజీ సర్పంచ్‌ బొల్లారం మాజీ సర్పంచ్‌ సుభద్రమ్మ,పెసరవాయి వడ్డు లక్ష్మీదేవి, కరిముద్దేల ఈశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, మంచాలగడ్డ ప్రతాపరెడ్డి, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.