వరదా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశంపార్టీలో చేరారు. అధికారపార్టీ గడిచిన ఐదేళ్ళలో అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు పట్ల విసుగు చెంది టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. వైసీపీకి చెందిన కడప జిల్లాకు చెందిన గాలిపోతుల సుదర్శన్‌తో పాటు 60మంది యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజుపాలెం మండలం మాజీ ఎంపీపీ ధనిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.