-మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు చారిత్రక అవసరమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇరువురి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. గెలుపు అనివార్యమైన పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావుని కలుసుకున్నారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర పురోగతికి టీడీపీ గెలుపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. వైకాపా నాయకుడు తెలుగుదేశం పార్టీలో పెద్దఎత్తున చేరారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలేనికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నల్లూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరారు.