టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు
అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసీపీ పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ , జనసేన అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ శికామణి సెంటర్ వద్ద నుండి రెడ్ సర్కిల్ వరకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’ ఇస్తూ పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బొండా ఉమామహేశ్వరావుతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు పేరు పోగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అనుభవమున్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ నిబద్దత కలిగిన వ్యక్తి వీరిరువురి కలయిక రానున్న రోజులలో ప్రజలకు మేలు చేయబోతుందన్నారు. జనసేన, తెలుగుదేశం కలయికతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో దడ మొదలయ్యింది అని, ఈరోజు మహిళల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఇంటింటికి వెళ్తుంటే మహిళలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. నిత్యావసర ధరలు పప్పు, ఉప్పు, సరుకులు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రూ. 500లు వచ్చే కరెంటు చార్జీలు ఈరోజున రూ. 2000 వరకు వస్తుందని విమర్శించారు. కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు.