దుర్గి 22 మహానాడు న్యూస్: దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. దుర్గి మండలంలోని కంచరగుంట గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘటన జరగ్గా.. మంటలు మొదలవగానే అందులోని 30 మంది విద్యార్థులను దించేశారు. బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు.విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.