నా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి

లావు శ్రీకృష్ణ దేవరాయలు

విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలని లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్రంగా ఖండించారు.నా పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా వైస్సార్సీపీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు.నాకు ఎటువంటి సభ్యత్వం లేని కంపెనీతో జత కట్టి, ఫోటోలను జోడించి బురదజల్లే వ్యవహారాలు చేయటం సరికాదు.ఒక వైపు అసలు వాస్తవాలు తెల్చేందుకు సిబీఐ విచారణ చేస్తోంది.. నిజాలు బయటకు రాకముందే సంభందం లేని విషయంలోకి నన్ను లాగుతూ వైస్సార్సీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చాలా బాధాకరం.దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ కు కంప్లైంట్ చేయటం జరిగింది.దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేసారు.