టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
గూడూరు, మహానాడు : విభజన అనంతరం అతలాకుతలంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని భావించిన ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన రాక్షస ప్రభుత్వం రాష్ట్రాన్ని పీక్కుతింటోంది. రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారనే కక్షతో చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఏనాడూ రాజకీయాల్లోకి రాని భువనమ్మ నిజం గెలవాలనే పేరుతో ప్రజల్లోకి వచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తున్నారు. నేటికి 6,500కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి 160పైగా కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. సొంత బాబాయ్‌నే చంపేసిన వారి పాలనలో ధైర్యం చేసి బయటకు వచ్చి పార్టీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. పార్టీ కార్యకర్తల పట్ల భువనమ్మకు ఉన్న ప్రేమ, అభిమానం కొలవలేనిదన్నారు.