హోలీ సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ లోని లేహ్ సైనిక స్థావరాన్ని సందర్శించారు. సైనికులతో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు. ‘‘ఢిల్లీ మన దేశ రాజధాని. ముంబై మన ఆర్థిక రాజధాని.. వీటి మాదిరి గానే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. హోళీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితం లోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు.