– అభినందనలు తెలిపిన పెందుర్తి ఎమ్మేల్యే అదీప్ రాజ్
– మద్దతు తెలిపిన పలువురు సీనియర్ జిల్లా నాయకులు
స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి ముత్యాలనాయుడని, కూటమి అభ్యర్థి సియం రమేష్ గతమంతా అవినీతి మయమని, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ముత్యాలనాయుడు కి., రమేష్ కి చాలా వ్యత్యాసం ఉందని పలువురు జిల్లా నాయకులు తెలిపారు.
అనంతరం పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ తారువలోని డిప్యూటీ ముత్యాలనాయుడుని కలిసి అభినందనలు తెలిపారు. పలువురు నాయకులు విచ్చేసి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసి మద్దతు తెలిపారు. పరవాడ జడ్పిటిసి పిఎస్ రాజు, వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శివాజీ , నర్సీపట్నం సీనియర్ నాయకులు బొలిమ నరసింహమూర్తి మొదలైన వారు ఉన్నారు.