పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి మండలం గణపవరం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి 95వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర, టీడీపీ నాయకులు ఉన్నారు.