వేమూరు టీడీపీ, జనసేన విస్తృత స్థాయి సమావేశం

పాల్గొన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు

వేమూరు, మహానాడు: వేమూరు తెలుగుదేశం కార్యాలయంలో గురువారం ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజక వర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ అభ్యర్థిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉసా రాజేష్‌, ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్‌ ఇన్‌చార్జీలు, యూనిట్‌ ఇన్‌చార్జీలు, బూత్‌ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.