వినుకొండ తెలుగుదేశంలోకి భారీగా వలసలు

బొల్లాపల్లి మండలం నుంచి 105 కుటుంబాల చేరిక

వినుకొండ, మహానాడు: కొన్నిరోజులుగా అధికార వైసీపీ నుంచి వినుకొండ తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానికంగా కీలకమైన బొల్లాపల్లి మండలం గంగపల్లి, పలుకూరు, రామాపురం, సోమలవాగు తండా, వెల్లటూరు నుంచి ఆదివారం తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. ఆదివారం కూడా 105 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వెల్లటూరు నుంచి 40 కుటుంబాలు, సోమలవాగు తండా నుంచి 30 కుటుంబాలు, గంగపల్లి నుంచి 20 కుటుంబాలు, పలుకూరు, రామాపురం నుంచి 15 కుటుంబాలు చేరాయి. పలుకూరు సర్పంచ్‌ యలగాల బాలయ్య కూడా చేరిన వారిలో ఉన్నా రు.

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో వీరు వినుకొండ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు హనుమాన్‌ నాయక్‌, నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పెసల వెంకట నారాయణ, పి.వెంకటేశ్వర్లు, అర్దలపూడి శ్రీనివాసరావు, ఆళ్ల నన్నయ్య,హనుమా నాయక్‌, ఎలిశెట్టి రంగయ్య, నిమ్మకాయల బామూరావు, రాచమల్లు కొండలు, తదితరులు పాల్గొన్నారు.