వైసీపీ నేత మేత కోసం

టీటీడీ నిధుల దారిమళ్లింపు!
రూ.1500 కోట్ల పనులకు టెండర్లు
చైర్మన్‌ కమీషన్ల కోసమేనన్న ఆరోపణలు
ఈవోపై చర్యలు తీసుకోవాలని
ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ, బీజేపీ ఫిర్యాదు

విజయవాడ, మహానాడు: వైసీపీ నేత మేత కోసం నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ ఈవో ధర్నారెడ్డి పెద్దఎత్తున రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన వైనంపై పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల దేవస్థానం పవిత్రతను చెడగొడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో బీజేపీ, ఇతర పార్టీల నాయకులు కోర్టులలో కేసులు కూడా వేశారు. కోర్టు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు కూడా ఇచ్చింది. టీటీ డీ నిధులను ఇతర అవసరాలకు దారిమళ్లించడాన్ని తప్పుపట్టింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. 2020లో టీటీడీ రూ.5000 కోట్లను రాష్ట్ర బాండ్ల రూపంలో దారి మళ్లించిన కుట్రను బీజేపీ, మఠాధిపతులు అడ్డుకున్నారు. గతంలో ఒక శాతం అంటే దాదాపు రూ.50 కోట్లు ఇలా విడుదల చేసుకునే ప్రయత్నం చేసింది.

ధార్మిక సంఘాలు, బీజేపీ చేసిన పోరాటం వల్ల వెనక్కి తగ్గింది. మళ్లీ నెల తిరగకుండానే తిరుపతి మునిసిపల్‌ శానిటేషన్‌ వర్కర్ల జీతాల రూపంలో రూ.100 కోట్లు విడుదల చేయాలన్న టీటీడీ ప్రయత్నా న్ని బీజేపీ తిప్పికొట్టింది. ఇలా అనేక సందర్భాల్లో నిధులను దారిమళ్లించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మల్లీ గడిచిన 8 నెలల్లో టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి కొడుకు ప్రస్తుత తిరుపతి డిప్యూటీ మేయర్‌, వైసీపీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి అభినయ్‌ని గెలుపు కోసం ఈఓ ధర్మారెడ్డి రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఇంత పెద్దఎత్తున టీటీడీ నిధులు సివిల్‌ పనుల కోసం దారి మళ్లించడం దారుణం. అందులో టీటీడీ చైర్మన్‌ సివిల్‌ పనులలో 10 శాతం, రోడ్డు పనులలో 15 శాతం లంచాలు తీసుకోవడం మరింత దారుణం. రూల్స్‌కి విరుద్ధంగా తిరుమలను వైసీపీ కార్యాలయంగా మారుస్తున్న ఈఓ ధర్మారెడ్డిపై వెంట నే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను సోమవా రం బీజేపీ అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, సాదినేని యామినిశర్మ, మీడియా ప్యాన లిస్ట్‌ పాటి బండ్ల రామకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కలిసి వినతిపత్రం ఇచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.