దర్శిని అభివృద్ధి పథంలో నడిపిస్తా

టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణంలో 19వ వార్డులో టీడీపి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఉదయం చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. మహిళలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. సీనియర్‌ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సహకారంతో దర్శి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ఎంపీ అభ్యర్థి మాగుంటతో కలిసి పట్టణంలో మంచినీటి కష్టాలు తీరుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, కౌన్సిలర్‌ దారం నాగవేణి సుబ్బారావు, తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి, నాయకులు ఉల్లి పిచ్చయ్య, దారం కొండా, తిరుమల వెంకి (బిల్లా), సంగు కొండలు, దారం నరసింహారావు, బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి, జనసేన పట్టణ అధ్యక్షులు చాతరాసి కొండయ్య, ప్రోగ్రాం కమిటీ మెంబెర్‌ పసుపులేటి చిరంజీవి, ఐటీ విభాగం కో ఆర్డినేటర్‌ ఉల్లి బ్రహ్మయ్య, నాయకులు పాపారావు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.