ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, మహానాడు: మాదిగలకు రాష్ట్రంలో ప్రథమ శత్రువు జగన్మోహన్‌రెడ్డి అని, ఆయన ఓటమికి పనిచేస్తామని, కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాదిగలు వైసీపీ ఓటమికి, ఆ పార్టీపై పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్డీయే కూటమి పోటీ చేసే ఎన్నికల్లో వారి గెలుపునకు ఎమ్మార్పీఎస్ పూర్తి సహ కారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
టీడీపీ రాజకీయంగా మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చా రు..వైసీపీ ఇవ్వలేదు అందుకే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు. అన్ని స్థానాల్లో కూటమి గెలుపుకోసం పనిచేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే మాదిగల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు జరగా లంటే కూటమి గెలుపుకోసం మాదిగలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలోని మాదిగలు జగన్‌ను ప్రథóమ శత్రువుగా భావించి ఎన్నికలకు సిద్ధం అయ్యామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ మాదిగలకు మొండిచేయి చూపారని విమర్శించారు. ఆయనను ఓడిరచేవరకు ఎమ్మార్పీఎస్ వదిలిపెట్టదని హెచ్చరించారు. మాదిగలను ఎదగకుండా అణగ దొక్కాడని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని, నవరత్నాల పేరుతో దళితులను అట్టడుగు స్థాయికి చేర్చిన ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు.