పదవులు కాదు..సామాజిక న్యాయం ముఖ్యం

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, మహానాడు:పదవులు కాదు..సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన నామ మాత్రం పదవులు ఇచ్చి అన్ని వర్గాలను కీలుబొమ్మలుగా చేశారని, పదవులు కాదు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పుకొచ్చారు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్‌ హత్యలు జరగలేదన్నారు. రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృ ద్ధి కోసం పనిచేశారని తెలిపారు.

ఈసారి కూటమిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. బ్రిటిష్‌ వలసవాదులకు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి ఏం తేడా లేదని విమర్శించారు. కాసు మహేష్‌ రెడ్డి గురజాల నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని, గొడవలు పెట్టి 11 మంది హత్యకు కారణమయ్యారని విమర్శించారు.