ఉపయోగపడని నేత అవసరమా?

మైదుకూరు వైసీపీ అభ్యర్థికి షర్మిల కౌంటర్‌

కడప జిల్లా మైదుకూరు, మహానాడు: మైదుకూరులో కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిలా రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మైదుకూ రు ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైదుకూరు ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఎప్పుడైనా కనిపించాడా? ఎవరికైనా సహాయం చేశాడా? ఉపయోగపడని ఎమ్మెల్యే ఎందుకు ? ఈయన ప్రెస్‌ మీట్‌ పెట్టి నేను, సునీత కలిసి అవినాష్‌ రెడ్డి మీద అభాండాలు వేశామని తెగ బాధ పడ్డాడట. మేము సీబీఐ చెప్పిందే చెబుతున్నాం అని సమాధానం చెప్పారు. హత్య జరిగినప్పుడు మాకు తెలియదు..దస్తగిరి లాంటి హంతకుడుని పట్టుకొని ఆధారాలు బయట పెడితే మాకు అర్థం కాలేదు..సీబీఐ చెప్తే తప్పా మాకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నామా? ఆధారాలతోనే మాట్లాడుతున్నామని హితవుపలికారు. హత్య జరిగితే సాక్షి చానెల్‌లో గుండెపోటు అని ఎందుకు రాశారో సమాధా నం చెబుతారా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేయాలి అంటే ఎందుకు వద్దు అన్నారో సమాధానం చెప్పాలని కోరారు. సునీతా రెడ్డి మాట్లాడుతూ వివేకాను ఎంపీ సీటు కోసం ఏడు సార్లు గొడ్డలితో నరికారు. హంతకుడిని రక్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు.. కనీసం ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చింది లేదు…హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.