కడప జిల్లా మైదుకూరు, మహానాడు: మైదుకూరు నియోజకవర్గంలో సోమవారం వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగిం ది. దువ్వూరు మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతుండగా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన షర్మిల జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరా రు. ఒక వైసీపీ కార్యకర్తను పిలిచి మాట్లాడారు. ఆమె అడిగిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమి లేదంటూ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ అభిమానులు నినాదాలు చేశారు. ఒకప్పుడు నేను కూడా జై జగన్ ఆన్న వ్యక్తినే అని రాష్ట్ర అభివృద్ధిపై మాట తప్పాడని అన్నారు. మద్యనిషేధం అన్నాడు అమలైందా ? ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం కడతాం అన్నాడు… కట్టాడా? రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా? అని ప్రశ్నించారు.