పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, భూపేష్
జమ్మలమడుగు, మహానాడు: జమ్మలమడుగు నియోజవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డితో కలిసి ముద్దనూరు పట్టణం ఉమ్మడిశెట్టి కళ్యాణ మండపంలో మండల కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ పాల్గొన్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు భూపేష్ కృతజ్ఞతలు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ రావాలంటే కూటమిని గెలిపించుకోవాలని కోరారు. ఆదినారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.