ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతోపాటు, అంబటి రాయుడు (క్రికెటర్), నృత్య దర్శకుడు జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు.