-ఐదుగురు యువకుల అరెస్ట్
-మరో ఘటనలో గంజాయి స్వాధీనం
హైదరాబాద్, మహానాడు: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సనత్ నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్ర నగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి బుధవారం సీజ్ చేశారు. నాలుగు గ్రాముల ఎండీఎంఏ, ఐదు గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి మత్తులో మునిగారు. గోవా నుంచి వీటిని కొనుగోలు చేసిన సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సనత్ నగర్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌తో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, దుండిగల్ పీఎస్ పరిధిలో మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఒరిస్సాకు చెందిన రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగా అనే ముగ్గురు యువకు లను అరెస్ట్ చేశారు. రూ.33,750 విలువైన 1.35 కిలోల గంజాయిని సీజ్ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందా చేస్తున్నారు. ఒడిస్సాకు చెందిన కార్మికులు రూ.7 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు.