ఒంగోలు టీడీపీ నేతపై దాడి హేయం
ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించడం నేరమా?
పోలీసులున్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు
ఘటనకు బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం
ప్రకాశం ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, మహానాడు : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవ దన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించటం సిగ్గుచేటన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై మూకు మ్మడి దాడి చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు.
గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేయటం వైసీపీ మూకల పరాకాష్టకు నిదర్శనమన్నారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలం లో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో అర్థమవుతుందని, దాడికి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతిభద్రతలు దెబ్బతీసేలా ప్రవ ర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కోరారు. మోహన్‌రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.