20 ఏళ్ల పాటు ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
రంజాన్‌ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు
పాల్గొన్న మక్కెన మల్లికార్జునరావు

వినుకొండ, మహానాడు: రంజాన్‌ సందర్భంగా ముస్లిం విద్యార్థులకు 20 ఏళ్ల పాటు ఉపకార వేతనాలు ఇవ్వను న్నట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రకటించారు. గురువారం విను కొండ`తిమ్మాయపాలెం రోడ్డులో ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు పవిత్రమైన రంజాన్‌ పర్వదినం సందర్భంగా స్థానిక మైనార్టీ విద్యార్థుల చదువులకు అండగా నిలిచేందుకు ఏటా 100 మంది చొప్పున తన వ్యక్తిగతంగా ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబి óస్తున్నట్లు వెల్లడిరచారు. 50 మంది బాలికలు, 50 మంది బాలురకు ఉపకార వేతనాలు అందిస్తామని వివరించారు.

వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ మసీదు కట్టినా తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు వారికి ఏ అవసరం వచ్చినా తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ ముస్లింలతో పాటు నియోజకవర్గ ప్రజ లంతా సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపి వారితో నమాజ్‌ చేశారు.